సూర్యాపేట జిల్లా:నేడు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు,ప్రజా సంఘాలకు చెందిన నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మొలకపల్లి రాంబాబు,ఇతర పార్టీల,
ప్రజా సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని హుజూర్ నగర్ పీఎస్‌కు తరలించారు.
రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నియంత పాలన సాగుతున్నదన్నారు.అధికారంలోకి వస్తే ఏడో గ్యారంటీగా స్వేచ్ఛ, ప్రజాస్వామిక హక్కులను కాపాడతానని హామీ ఇచ్చి ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.