నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలో తమ భూమిని కబ్జా చేయడానికిఅధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ అండదండలతో ప్రయత్నిస్తున్నారని పట్టణానికి చెందిన తాహేరా బేగం,సాబెర్ బేగం,లతిఫా బేగం,నస్రీన్ సుల్తానాలు ఆరోపించారు.ఆదివారం మిర్యాలగూడ ప్రెస్ క్లబ్ లో మరో అధికార పార్టీ కౌన్సిలర్ ఇలియాజ్ ఖాన్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రకాష్ నగర్ కాలనీలో సర్వే నెంబర్ 803 లో తమకు 2 ఎకరాల 38గుంటల భూమి ఉందని,అందులో 38 గుంటలు ఎన్నెస్పీ కెనాల్ కోసం పొగా అవార్డు కూడా పొందామని,దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
మిగిలిన రెండు ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ మలగం రమేష్ అండదండలతో మందుల ఎల్లయ్య,అశోక్, సమీర్ అనే వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని,రికార్డు పరంగా తమకే అన్ని హక్కులు ఉన్నపటికీ సదరు కౌన్సిలర్ తమకు భూమి పాస్ పుస్తకాలు రాకుండా అడ్డు పడుతున్నాడని అవేదన వ్యక్తం చేశారు.
అతని మాటలు విని స్థానికతహసీల్దార్ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు చెప్పారు.
తాము ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్లినంత మాత్రాన తమ భూమి కబ్జా చేయడం అన్యాయమన్నారు.మందుల యల్లయ్యపై ఇప్పటికే కేసు కూడా నమోదైందని,అయినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు
.