గొర్రెల పంపిణీలో అవకతవకలు-నగదు బదిలీయే మార్గం

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు తావులేకుండా గొల్ల, కురుమలకు లబ్ది జరుగాలంటే నగదు బదిలీయే సరైన పరిష్కారమని వివిధ సంఘాలు,రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ అసోసియేషన్ భవన్ లో తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం(జిఎంపీఎస్) జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

 Irregularities In Distribution Of Sheep-cash Transfer Is The Way-TeluguStop.com

ఈ సమావేశానికి తెలంగాణ గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (జిఎంపిఎస్) ఉడుత రవిందర్ ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో ఇప్పటి వరకు జరిగిన గొర్రెల పంపిణీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని,నిబంధనలు పాతరేసి నాసిరకం గొర్రెలు, ముసలి గొర్రెలు,చిన్నపిల్లలు కురుమ గొల్లలకు కట్టబెట్టారని ఆరోపించారు.మేతకు భూములు లేక చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు.

ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం మూలంగా గొల్లకురుమలు ఆర్ధికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మధ్యదళారీలు,కొంతమంది పశువుల డాక్టర్లు మాత్రమే లాభపడ్డారని విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3,39,980 మంది సభ్యులకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉందని తక్షణమే రెండో విడత నగదు పంపిణీ ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.గ్రౌండింగ్ చేయటం రాజకీయ ప్రయోజనాల కోసం,ఎన్నికల స్టంట్ లో భాగంగా కాకుండా గొల్ల కురుమల కుటుంబాల అభివృద్ధికి చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేయాలని డిమాండ్ చేశారు.

దళారుల ప్రమేయం లేకుండా రైతు బంధు,దళిత బంధు లాగా డైరెక్ట్ గా గొల్ల, కురుమల ఎకౌంట్లలోకి నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ రైతుబంధు, దళితబంధు పథకం లాగా గొర్రెల మేకల పెంపకం దారులకు నగదు పంపిణీ చేయాలని కోరారు.

ఈ విషయమై మా పార్టీలో చర్చించి అమలు కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.గొర్రెల పంపిణీ మూలంగా ఆంధ్ర దళారులకు వెటర్నరీ డాక్టర్లకు మాత్రమే ఉపయోగం జరిగిందని ఈ పథకంలో జరిగిన లోపాలను సవరించి ప్రభుత్వమే నేరుగా నగదు బదిలీ చేసే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తారని అన్నారు.

ఇందు కోసం జిఎంపిఎస్ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమానికి సంపూర్ణ మద్దతుగా నిలబడి ప్రత్యక్ష భాగస్వామ్యం అవుతామని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల,పార్టీల వక్తలు తెలిపారు.ఈ డిమాండ్ పై స్థానిక ఎమ్మెల్యే,మండల జడ్పిటిసిలకు ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్ లు ఇవ్వాలని రాష్ట్రస్థాయిలో పశువర్ధక శాఖ మంత్రికి ముఖ్యమంత్రికి పత్రం అందజేయడంతో పాటు కింది స్థాయిలో వివిధ స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాలు చేసి నగదు సాధించేవరకు ఉద్యమిస్తామని వక్తలు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్,జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి, ఉమ్మడి నల్గొండ జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులు పోలబోయిన నరసయ్య యాదవ్,తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్ల యాదవ్,కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తండు శ్రీనివాస్ యాదవ్,తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు మాండ్ర మల్లయ్య యాదవ్,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెళ్లి సైదులు,వామపక్ష పార్టీల జిల్లా నాయకులు బుద్ధ సత్యనారాయణ, చామకూరి నరసయ్య,ఎర్ర అఖిల్,అఖిలభారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మర్యాద ఉపేందర్ యాదవ్,గొల్ల కురుమ నవనిర్మాణ సమితి జిల్లా అధ్యక్షులు బుక్క రాజు తిరుపతి,జ్యోతిరావు పూలే అధ్యయన వేదిక కన్వీనర్ జటంగి సమనయ్య యాదవ్,తుమ్మల పెన్ పహాడ్ ఎంపిటిసి మల్లయ్య యాదవ్,బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి వేల్పుల లింగయ్య యాదవ్,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, జిఎంపిఎస్ జిల్లా నాయకులు వజ్జా వినయ్ యాదవ్, కడారి లింగయ్య యాదవ్,కలంచర్ల రాములు, ఎల్లేష్,వీరన్న,మట్టపల్లి మల్లేష్,పిల్లి వీరమల్లయ్య, అమరబోయిన కృష్ణ,యాదవ సంఘం రాష్ట్ర నాయకులు కన్నెబోయిన రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube