సోషల్ మీడియా ప్రచారంపై నిఘా:జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఎన్నికల కోడ్ ( Election Code )అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు,వార్తలపై గట్టి నిఘా పెంచామని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్(S Venkata Rao ) అన్నారు.

 Surveillance On Social Media Campaign: District Collector S Venkata Rao , Elect-TeluguStop.com

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నందు జి-3 రూమ్ లో సోషల్ మీడియా( Social media) ట్రాకింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తో కలసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్,వాట్సప్, యూట్యూబ్,ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల్లో ప్రచారం ఎక్కువగా వస్తున్నందున ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన ట్రాకింగ్ కేంద్రం ద్వారా సోషల్ మీడియా ఐటమ్స్ పై ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

నియోజకవర్గాల వారీగా పరిశీలన తదుపరి ఆయా నియోజకవర్గాలకు సోషల్ మీడియా వార్తలు, ప్రకటనలు పంపించడం జరుగుతుందని తెలిపారు.ప్రకటనలు,ప్రచారం చేసే వారు ముందుగా ట్రాకింగ్( Tracking ) కేంద్రం ద్వారా అనుమతులు పొందాలని సూచించారు.

ఫిర్యాదుల కేంద్రం నుంచి యంత్రాంగం ఇంటర్నెట్ బేస్డ్ మీడియాలలో వచ్చే ఎన్నికల ప్రచారాలపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందని వివరించారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సోషల్ మీడియాలో వచ్చే వాటిని పరిశీలనలో తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తదుపరి మీడియా సెంటర్, ఇంటిగ్రేటడ్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి చెక్పోస్ట్ లలో తనిఖీలు,సంబంధిత రికార్డులు అలాగే మీడియా సెంటర్ లో చానల్స్ రికార్డింగ్ ను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పెయిడ్ న్యూస్, పెయిడ్ ఆర్టికల్స్ పై దిశా నిర్దేశ్యం చేశారు.ఎంసిఎంసి నుండి పత్రికలు,ఛానళ్లు ప్రకటనలకై అలాగే ఆయా పార్టీల అభ్యర్థులు ప్రకటనలు,పోస్టర్లు, పాంప్లెట్స్ అనుమతులు తీసుకోవాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube