సూర్యాపేట జిల్లా:హుజార్ నగర్ పట్టణంలోని మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.సాధారణంగా వేసవిలో టమాటాల ధర మాత్రమే పెరగడం చూస్తుంటాం.కానీ, హుజూర్ నగర్ ప్రాంతంలో మాత్రం కూరగాయలు కిలో రూ.80 నుంచి రూ.100 పైనే పెరిగిపోయాయి.రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.
దీంతో అన్నిరకాల ధరలకు రెక్కలొచ్చి కూరగాయల ధరలు మండిపోతున్నాయి.రైతు బజార్లు,వారాంతపు సంత,కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరలు సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.పెరిగిన ధరలతో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు.