సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల( Thungathurthy ) కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిలు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.పాఠశాలలో ఏఎన్ఎం లేకపోవడంతో ఒక టీచర్ సాయంతో విద్యార్థినిలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
హాస్పిటల్ డాక్టర్ మమత( Dr.Mamata ) విద్యార్ధినిలను పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినిలు( Students ) మాట్లాడుతూ రెండు రోజులుగా కడుపులో నొప్పి,జ్వరం,విరోచనాలతో బాధపడుతున్నామని, తగ్గకపోవడంతో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ మమత మాట్లాడుతూ పాఠశాలలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థినిలు నీళ్లు,ఆహారం వల్ల జ్వరం,విరోచనాలతో అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు.
పాఠశాల విద్యార్థినిలు అస్వస్థతకు గురై ఇబ్బంది పడుతుంటే కనీసం పాఠశాల ప్రిన్సిపాల్ పట్టించుకోవడంలేదని, తమ తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు.