సుర్యాపేట జిల్లా:తండ్రి జీతం రాక తమ జీవితాలు సందిగ్ధంలో పడ్డాయని,ఎందుకు జీతం డబ్బులు ఆపేశారో తెలియక అయోమయంలో ఉన్నామని, తమను ఆదుకోవాలని ఇద్దరు పిల్లలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన వీఆర్ఏ ఎడ్ల మల్లయ్యకు మే నెల జీతం అకారణంగా,ముందస్తు సమాచారం ఇవ్వకుండా బిల్లు చేయమంటే చేయకుండా ఆపేశారని ఆరోపిస్తూ వీఆర్ఏ ఇద్దరు పిల్లలు కుమారుడు ఎడ్ల యశ్వంత్ కుమార్ (డిగ్రీ ద్వితీయ సంవత్సరం),కూతురు ఎడ్ల సురంజిత (ఎమ్మెస్సి అగ్రికల్చర్) మద్దిరాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ జీతం డబ్బులు లేక తమ చదువులు ఆగిపోవడం మాత్రమే గాక,పోషణకు కూడా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.మానసికంగా మా తండ్రి ఆవేదనకు గురయ్యారని పిటిషన్ లో పేర్కొన్నారు.
మద్దిరాల మండల తహశీల్దార్ పై చర్యలు తీసుకొని జీతం ఇప్పించాలని పోలీస్ స్టేషన్ లో విఆర్ ఎ కొడుకు (Degre 2nd year) , (msc agriculture) ఫిర్యాదు చేశారు.