సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నూతనకల్ మండలం ( Nuthankal mandal )చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బిక్కి పృథ్వి(16)బైక్ పై మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వైపు వెళ్తూ ఎంపిడివో ఆఫిస్ నుండి మెయిన్ రోడ్డి వైపు వస్తున్న టీవీఎస్ ను అతి వేగంగా ఢీ కొట్టడంతో పృథ్వి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని కొట్టింది.
దీనితో పృథ్వీ అపస్మారక స్థితిలోకి వెళ్లగా, అదే బైక్ పై ఉన్న వ్యక్తికి మరియు టీవీఎస్ బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం 108 లో సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మరణించడంతో చిల్పకుంట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.