క్రీడల ద్వారా మేదస్సు పెరుగుతుంది...!

సూర్యాపేట జిల్లా:క్రీడల ( Sports )ద్వారా మేధస్సు పెరుగుతుందని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరుగుతున్న చెస్ సెలక్షన్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి( Jagadish Reddy Guntakandla ) క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారన్నారు.

 Intelligence Increases Through Sports...!-TeluguStop.com

అదేవిధంగా మే నెలలో గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ లో సుమారు 200 విద్యార్థులకు శిక్షణ ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

బాలుర విభాగం నుంచి నలుగురు,బాలికల విభాగం నుంచి నలుగురిని స్టేట్ సెలక్షన్ కమిటీకి ఎంపిక చేశామన్నారు.

జూన్ నెలలో ఆసిఫాబాద్ కొమరం జిల్లాలో 9,10,11 తేదీలలో అంతర్ రాష్ట్రీయ పోటీలలో ఈ విద్యార్థులు పాల్గొంటారని,జూన్ 10వ తారీఖున బాలికల చెస్ రాష్ట్ర పోటీలు టిటిడి కళ్యాణ మండపం సూర్యాపేటలో జరుగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధీర్,జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సాయికుమార్( Saikumar ),జిల్లా సంయుక్త కార్యదర్శి గడ్డం లింగారెడ్డి,జిల్లా కోశాధికారి వెంకటరమణ,గుండా వెంకన్న,మీలా వంశీ, గండూరి ప్రభాకర్,బొల్లం సురేష్,భిక్షం,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube