పచ్చళ్లు, తొక్కుల వలన అరోగ్యానికి ఎన్ని నష్టాలో

వేసవిలో మామిడికాయ ఎంత ఫేమసో, మామిడికాయ పచ్చడి కూడా అంతే ఫేమస్.అన్నంలో ఆవకాయ ఎప్పటికి బోర్ కొట్టదు అంటూ మన తెలుగువారైతో రోజుకి రెండు పూటల పచ్చడి వేసుకోని తింటారు.

 How Eating Pickles Can Hurt Your Health-TeluguStop.com

పూర్తీగా పచ్చడితో కాకపోయినా, అలా అంటుకైనా పచ్చడి ఉండి తీరాల్సిందే అంటారు.అవకాయ ఒక్కటే కాదు, ఉసిరి పచ్చడి, నిమ్మ పచ్చడి, కొత్తిమీర పచ్చడి .ఇంకా చెప్పాలంటే చికెన్ పచ్చడి కూడా పెట్టుకుంటారు జనాలు.మరి ఈ పచ్చళ్ళు మంచివేనా? ఒకపూట వండిన కూర మరో పూట తినాలంటేనే సందేహిస్తాం .అలాంటిది పచ్చడిని రోజులు, నెలలకొద్దీ తినడం మంచిదేనా? పచ్చడి త్వరగా పాడవదు .అంతమాత్రాన అది శరీరాన్ని పాడు చేయదంటారా? పచ్చడి ప్రేమికులకి ఈ మాట నచ్చకపోవచ్చు కాని, పచ్చళ్ళ వలన శరీరానికి ఎన్నో నష్టాలున్నాయి.

* మన భారతీయలు తినాల్సిన దాని కన్నా రెండింతలు ఎక్కువ ఉప్పు తింటారని సర్వేలు చెబుతున్నాయి.దీనికి కారణం మనం ఇష్టపడి తినే పచ్చళ్ళు, చట్నీలు, తొక్కులు.

పచ్చళ్ళలో ఉప్పుశాతం ఎక్కువ ఉంటుంది.దాంతో ఒంట్లో సోడియం లెవల్స్ పెరిగిపోతాయి.

బ్లడ్ ప్రెషర్ సమస్యలు, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలపాటు పొట్ట ఉబ్బటం లాంటి ప్రమాదాలు ఉంటాయి.మన దేశంలో చాలామందికి ఫ్యామిలి ప్యాక్ ఉండటానికి ఇది కూడా ఓ కారణం.

* పచ్చళ్ళు ఎక్కువ కాలం ఆగటానికి నూనే బాగా వాడతారు.నూనెలో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి.దాంతో మన ఒంట్లోకి పెద్ద మొత్తంలో ఫ్యాట్ వెళ్ళిపోతుంది.ఈ కారణంతో కొలెస్టెరాల్ సమస్యలు, గుండె వ్యాధులు వస్తాయి.

* పికెల్స్ మెటాబాలిజం రేటుకి, జీర్ణక్రియకు స్నేహపూరితమైనవి కావు.అతిగా పచ్చళ్ళు తింటే మోషన్స్ అవుతాయి.

ఈ విషయం అందరికీ తెలిసిందే.ఇందులో పెద్దగా సైన్స్ అవసరం లేదు అనుకుంటా.

* హై సోడియం లెవల్స్ తీసుకొచ్చే పచ్చళ్ళు కిడ్నీల ఆరోగ్యానికి మంచివి కావు అని ఇప్పటికే చెప్పుకున్నాం.మరో విషయం ఏమిటంటే, పచ్చళ్ళు ఎంత ఎక్కువగా తింటే, టాక్సిన్స్ అంత ఎక్కువగా జమ అవుతాయి.

పచ్చళ్ళు మీ కిడ్నీలకు మంచి ఆహారం కానే కాదు.

* అతిగా పచ్చళ్ళు తింటే ఒంట్లో వేడి పెరిగేది వాస్తవమే.

కారణం, పచ్చళ్ళలో ఉండే మసాలా, కారణం.ఇవి గ్యాస్ట్రిక్ సమస్యలకి కారణం అవుతాయి.

రాత్రిపూట తింటే మీ నిద్రకు భంగం కలిగిస్తాయి.అతిగా అలవాటు ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ వచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేం.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు