మెయిన్ రోడ్ విస్తరణలో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవాలి: కక్కిరేణి శ్రీనివాస్

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్ లో వ్యాపారస్తులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా దుకాణాలు ఖాళీ చేయించి నాలుగు సంవత్సరాలు అవుతున్నా,ఇంత వరకు పాక్షికంగా నష్టపోయిన వారికి నష్టపరిహారం గాని, పూర్తిగా కోల్పోయిన వారికి దుకాణాలు ఇవ్వకపొవడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు.జూలై నెల 24 వ తేదిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్,

 Help Those Who Lost Everything In Main Road Widening Kakkireni Srinivas, Main R-TeluguStop.com

పాత మున్సిపల్ ఆఫీస్ స్థలంలో కట్టిన కాంప్లెక్స్ ప్రారంభిస్తున్నారని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం జరుగుతుందని, ఇప్పటికైనా మెయిన్ రోడ్ విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లోగాని,పాత మున్సిపల్ ఆఫీస్ స్థలంలో కట్టిన కాంప్లెక్స్ లో గాని దుకాణాలు కేటాయించాలని,వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పాక్షికంగా నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube