సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే మేళ్లచెరువు జాతరను రాజకీయం చేయడంపై నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.శనివారం.
శ్రీఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభు లింగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేళ్లచెరువు మహాశివరాత్రి జాతరను రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.ఎద్దుల పందాలను బీఆర్ఎస్ పందేలుగా మార్చారని ఆరోపించారు.ఎన్నడూ లేని విధంగా గుడి ప్రాంగణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, రంగులరాట్నం నిర్వాహకులను బెదిరించి పోలీసుల మధ్యవర్తిత్వంతో బీఆర్ఎస్ నాయకులు రూ.14 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు.ఇదే కాకుండా ప్రభల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అధికారం ఉంది కదా అని పోలీసులను అడ్డం పెట్టుకొని బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలన్నీ గమనిస్తున్నారని,సరైన సమయంలో సరైన బుద్ధి చెబుతారని అన్నారు.