సూర్యాపేట జిల్లా:ప్రజా ప్రతినిధులు సేవే లక్ష్యంగా పట్టణ అభివృద్ధిలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసినప్పుడు పట్టణాలు ప్రగతి పథంలో నడుస్తాయని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మరియు రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ హైదరాబాద్ వారి సారథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు “మునిసిపల్ చట్టాలు – ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం”పై 2 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ,ప్రజా ప్రతినిధుల కర్తవ్యంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో కౌన్సిలర్లు మరియు ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సారథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ తెలియజేశారు.రానున్న రోజుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, మహాప్రస్థానం,తెలంగాణకు హరితహారంలో భాగంగా పట్టణ ప్రగతి వనాల,అభివృద్ధి క్రీడా ప్రాంగణాల ఏర్పాటు వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి చైర్ పర్సన్ పోతరాజు రజిని,నేరేడుచర్ల చైర్మన్ చందమల్ల జయబాబు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి,RCUES ట్రైనింగ్ కోఆర్డినేటర్స్ డాక్టర్ శ్రీనివాస్,సి.డి.ఏం.ఏ అధికారి డాక్టర్ కృష్ణ చైతన్య,విశాల్,మెప్మా అధికారి రమేష్ నాయక్, సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్,శిక్షణ కార్యక్రమం నిర్వాహకులు శ్రవణ్ రెడ్డి,నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీలత రెడ్డి,3 పట్టణాలకు సంబంధించిన వార్డు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.