కేసీఆర్ అధికారాన్ని కాపాడుకునే పనిలో ఉండు:మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

సూర్యాపేట జిల్లా:రాష్ట్రలో సీఎం కేసీఆర్( CM kcr ) తన అధికారాన్ని కాపాడుకునేందుకున్న ధ్యాస రాష్ట్ర ప్రజలపై లేదని సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ రాష్ట్ర నాయకులు,ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య( Gummadi Narasiah ) అన్నారు.మంగళవారం నేరేడుచర్ల పట్టణంలో నిరుపేదల సంఘంతో కలిసి ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని తాహాసిల్దార్ కి వినతిపత్రం అందించారు.

 Work To Protect Kcr's Power: Former Mla Gummadi Narasiah-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ సర్వే 243,244 ఇండ్ల స్థలాలు కేటాయించాలని నిరుపేదలు 8 ఏళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని,పైగా వారిపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ ఎన్నికల హామీలను మరిచి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇంటి స్థలం ఉంటే ఇండ్లు కట్టిస్తామన్న కేసీఆర్ సర్కార్ అసలు స్థలాలు లేని నిరుపేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి ఇండ్లు కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్, అఖిల్ కుమార్(Akhil Kumar ),వాస పల్లయ్య,కరుణాకర్, హుస్సేన్,నిరుపేదల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube