సూర్యాపేట జిల్లా:తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ,వైద్య విధాన పరిషత్,వైద్య విద్య,ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న శానిటేషన్,పేషంట్ కేర్,స్వీపర్స్,సెక్యూరిటీ గార్డ్స్,అఫిస్ సబ్ స్టాఫ్ సిబ్బంది వేతనాలు జీవో నెంబర్ 306 ప్రకారం 26 వేలు తగ్గకుండా ఇవ్వాలని సీఐటీయూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల కింది స్థాయి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ 150 మంది సీఐటీయూలో చేరిన సందర్భంగా నెమ్మాది మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా పేషంట్లకు 24 గంటలు సేవలు అందించిన వైద్యశాల పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.6000 వేలకు మించి ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.తెలంగాణ ప్రభుత్వ వివిధ శాఖల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచి ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు 30% పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచక పోవడం అన్యాయం అన్నారు.కార్మిక శాఖ విడుదల చేసిన జివో 68 ప్రకారం 5 సవంత్సరాలకు కాలపరిమితి దాటిపోయినా నేటికి వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుందని,నిమ్స్ లో రూ.16000 ఇస్తూ,జిల్లా కేంద్రంలోని వైద్య సిబ్బందికి మాత్రం రూ.6000 ఇస్తే,వాటితో బ్రతికే దెట్లని వాపోయారు.సవంత్సరానికి 24 సి ఎల్ ఎస్ అమలు చేయాలని,పీఎఫ్ అమలు చేయాలని,రెండు జతలు బట్టలు,బూట్లు,ఉద్యోగ భద్రత,కాంట్రాక్టు విధానం రద్దు,చనిపోయిన కార్మికులకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా,విశ్రాంతి భవనం,అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.