పెద్దగుట్ట బ్లాస్టింగ్ పై అధికారుల విచారణ

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండల( Atmakur (S) Mandal ) కేంద్రంలోని పెద్దగుట్టపై కెఎస్ఎన్ఎల్ క్రషర్ మిల్లు యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా క్రషర్ నిర్వహణ చేపడుతూ భారీ బ్లాస్టింగులకు పాల్పడుతోందని,దీనివల్ల బోర్లు పూడిపోతున్నాయి,దుమ్ము వలన పంటలు పండే పరిస్థితి లేక రైతులు( Farmers ) తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు రైతులు, గ్రామస్తులు వివిధ శాఖల అధికారులతో పాటు స్థానిక నాయకులకు ఫిర్యాదు చేశారు.అయినా గ్రామస్తుల ఆవేదన పట్టించుకునే నాథుడే లేకపోవడంతో క్రషర్ మిల్లు యాజమాన్యం చేస్తున్న భారీ బ్లాస్టింగులను భరిస్తూ వచ్చారు.

 Officials' Investigation On Pedgutta Blasting, Atmakur (s) Mandal , Nalgonda ,-TeluguStop.com

ఇటీవల మండల కేంద్రానికి వచ్చిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy )కి ఈ విషయమై గ్రామస్తులు, రైతులు ఫిర్యాదు చేశారు.దీనితో స్పందించిన మంత్రి ఉత్తమ్ విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్,రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారంపెద్దగుట్ట పరిసరాలను పరిశీలించి కొంతమంది రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

అదే విధంగా క్రషర్ నిర్వహణ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉన్నదని ఫిర్యాదులు రావడంతో అక్కడ కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి ఆర్డీవో కృష్ణయ్య క్యూ న్యూస్ తో మాట్లాడుతూ గ్రామ ప్రజలు,రైతుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు.మైనింగ్ ఏడి వెంకటరమణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు( Pollution Control Board ),స్థానిక రెవిన్యూ అధికారులు విచారణ చేపట్టి గుట్ట సర్వేనెంబర్ తప్పుగా నమోదైనట్లు తెలిపారు .ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఎస్సై కట్ట వెంకటరెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కాకి కృపాకర్ రెడ్డి,పందిరి మాధవరెడ్డి, రాంరెడ్డి,గిలకత్తుల ఎల్లయ్య,శ్రీను,అబ్బగాని భిక్షం,యాతాకుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube