సూర్యాపేట జిల్లా:మోతె మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో విద్యుత్ 11 కెవి విద్యుత్ లైన్( 11 kV power line ) ఇళ్ళకు మూరెడు ఎత్తులో నుండి వెళుతుంది.ఇంటికి పైకి వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం భయంతో బ్రతకాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్లపై నుండి ప్రమాదకర విద్యుత్ లైన్ వెళ్తుండడం వల్ల ప్రతీ రోజూ ప్రాణాలతో చేలాగటం ఆడాల్సి వస్తుందని,ఇంటి పైకి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతోందని,చిన్న పిల్లలు తెలియక పైకి వెళితే ఏం జరుగుతుందో తెలియని చిన్నారి పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంతటి ప్రమాదకర విద్యుత్ లైన్ పక్కనే ఉంటే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని, ప్రమాదకర సూచన బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని వాపోయారు.
ఎన్నిసార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకపోయినా ఫలితం లేకుండా పోయిందని, గ్రామంలో పని చేసే విద్యుత్ అధికారులు( Electricity Authorities ) చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తూ ప్రమాదాన్ని గాలికొదిలే విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.మా ప్రాణాలు పోతే కానీ,ఈ అధికారుల్లో చలనం వస్తుందేమోనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికరులు స్పందించి ఇళ్లపై ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్ తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.