సావిత్రి బాయి పూలే, ఫాతిమా భేగంలను స్ఫూర్తిగా తీసుకోవాలి: ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సూర్యాపేట జిల్లా: విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలని,తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.మంగళవారం సూర్యాపేట మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కొంకటి లక్ష్మినారాయణ, రాంబాబు నాయక్ లతో కలిసి సందర్శించారు.

 Savitri Bai Phule And Fatima Bhegam Should Be Taken As Inspiration Sc And St Com-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యతో పాటు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు.విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను పెంచాకోవాలని,ఎలాంటి ఒత్తడికి లోనవకుండా మనోదైర్యంతో ముందుకు సాగాలన్నారు.

ఏ విధమైన సమస్యలకు చావు కారణం కాకూడదని, సమస్యలు ఉంటే టీచర్లకు,తల్లిదండ్రులకు తెలియజేసి నివృత్తి చేసుకోవాలన్నారు.ముఖ్యంగా బాలికలు సావిత్రి బాయి పూలే,ఫాతిమ బేగంలను ఆదర్శoగా తీసుకోవాలని,దేశ భవిష్యత్తుకి ఆడపిల్లలే ఆధారం,అభివృద్ధి అన్నారు.

భువనగిరి, సూర్యాపేట జిల్లాలలో జరిగిన సంఘటనలు యావత్తు తెలంగాణను ద్రిగ్బాoతి చెందిదన్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని సంక్షేమ పాఠశాలలో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టి మానసిక నిపుణులచె విద్యార్థులకు మానసిక ఒత్తిడికి లోనవకుండా తరగతులు చేపట్టే విధంగా కమిషన్ ప్రభుత్వానికి సిపార్సు చేస్తుందన్నారు.

వైష్ణవి,అస్మిత రెండు కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఎక్సగ్రేషియా, ఉద్యోగం అందేలా కమిషన్ సిఫార్స్ చేస్తుందని స్పష్టం చేశారు.ముందుగా ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశమై జరిగిన సంఘటనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తదుపరి విద్యార్థులతో తరగతి గదిలో వైష్ణవి, అస్మితల స్నేహితులు, తోటి విద్యార్థులతో కళాశాలలో ఏర్పాటు చేసిన పేర్వల్ కార్యక్రమం, తదుపరి సంఘటనలు విడివిడిగా అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు పరీక్ష సమయంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడి పెంచవద్దని,స్నేహపూర్వక వాతావరణంలో పరీక్షలు రాసేవిధంగా ప్రోత్సాహించాలని సూచించారు.

తదుపరి పాఠశాల,కళాశాల వసతి గృహాలను కమిటీ సందర్శించి గదులు, మరుగుదొడ్లలను పరిశీలంచారు.తదుపరి వైష్ణవి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి,అదేవిధంగా అస్మిత కుటుంబ సభ్యులను కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

షెడ్యూల్డ్ కులాలు అన్ని రంగాలలో రానిచ్చేందుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలో త్రాగునీరు కొరకు ఆర్ఓ ప్లాంట్, నాణ్యమైన ఆహారం అందించాలని, మరుగుదొడ్ల మరమ్మతులు,ప్రహరీ గోడల నిర్మాణం,సీసీ కెమెరాలు పనిచేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కుల సంఘాల నాయకులు కమిషన్ కి వివరించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి, ఏఎస్పీ నాగేశ్వరావు, డిఎస్పీ రవి,ఆర్డీవో కృష్ణయ్య,డిటిడిఓ శంకర్, ఎస్సీ వెల్ఫర్ అధికారిని లత,తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి,ఆర్సీఓ అరుణ కుమారి,ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీలత,కమిటీ సభ్యులు జ్యోతిపద్మ, ఓఎస్డి ఉమ మహేశ్వరి, డాక్టర్ స్రవంతి,కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube