ప్రమాదాల నివారణ కోసం ఇంధన సంస్థల మాక్ డ్రిల్

సూర్యాపేట జిల్లా: పెట్రోలియం, గ్యాస్ పైప్ లైన్ నిర్వహణ,ప్రమాదాల నివారణ,ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులు,ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ప్రముఖ ఇంధన సంస్థలు హిందూస్తాన్ పెట్రోలియం,గెయిల్ ఇండియా లిమిటెడ్, పిఐఎల్ పెట్రోలియం సంస్థల అధ్వర్యంలో సూర్యాపేట రూరల్ పరిధిలో కేసారం గ్రామ శివారులో నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే పరిశీలించారు.

 Energy Companies Mock Drill For Accident Prevention, Energy Companies, Mock Dril-TeluguStop.com

సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రమాదాల ముందస్తు సూచికకు గాను నిత్యం పర్యవేక్షణ,పూర్తి అత్యాధునిక సెన్సార్ సిస్టంతో అలారం ఏర్పాటు ఉన్నదని ఎస్పికి వివరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యవసాయ పనులు,రోడ్డు పనులు, బోర్ వెల్ పనులు,మట్టి తవ్వకాల సమయంలో ఇంధన పైప్ లైన్స్ లీక్ అవడంతో వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నదని,దీనిపై సంస్థలు పూర్తిగా నిఘా ఉంచాలని తెలిపారు.

ప్రజలు,రైతులు, వ్యాపారులు మొదలగు వారు పనుల కార్యకలాపాల నిమిత్తం పైప్ లైన్ వెళ్ళే మార్గంలో, వ్యవసాయ భూముల్లో తవ్వకాలు జరిపేటప్పుడు, బోర్లు,డ్రిల్లింగ్ వేసేటప్పుడు సంస్థలకు సమాచారం అందించి ప్రమాదాల జరగకుండా జాగ్రత్త పడాలన్నారు.

ఈ మాక్ డ్రిల్ నందు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి,పిఐఎల్ సంస్థ ప్రతినిధులు కిషోర్,దుర్గా ప్రసాద్,గేయిల్ సంస్థ డిజిఎం యోగేష్,చీఫ్ మేనేజర్ వెంగలరావు, హెచ్పీసీఎల్ డిజిఎం అంకయ్య,ఆపరేషన్స్ ఆఫీసర్ గౌతమ్ రాజ్, స్థానిక ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube