ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా పెడుతుండ్రు...!

హుజూర్ నగర్(Huzur nagar) మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ, మున్సిపాల్టీ లే అవుట్ భూములను దర్జాగా కబ్జా చేసి,గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని,వాటిని కాపాడే బాధ్యత ప్రజలందరిపై ఉందని కాంగ్రెస్ కౌన్సిలర్లు(Congress Counselors) జక్కుల వీరయ్య,కోతి సంపత్ రెడ్డి అన్నారు.పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలోనీ సర్వే నంబర్ 185లో కొందరు ప్రభుత్వం భూమిని ఆక్రమించుకొని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నస్తాలన్ని శనివారం వారు పరిశీలించారు.

 Occupation Of Government Lands In Huzur Nagar,government Lands,huzur Nagar,layou-TeluguStop.com

అనంతరం వారు మాట్లాడుతూ అధికారులు వెంటనే ప్రభుత్వం స్థలంను స్వాధీనం చేసుకొని,వాటికి హద్దులు నిర్ణయించి బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో కుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని దీనితో మున్సిపాలిటీకి రావలసిన 10శాతం భూమి రాకుండా ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు.

కోట్ల విలువ చేసే లేఅవుట్, ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు.కొందరు కబ్జాదారులు అధికారులతో చేతులు కలిపి,రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపించారు.

మున్సిపాలిటీ లేఔట్ భూములను(Layout Lands) కాపాడాలని కమిషనర్ కి పలుమార్లు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు.రెవెన్యూ కార్యాలయం(Revenue office)లో గుంటలలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube