పట్టుదలతో విజయం సాధించవచ్చు

సూర్యాపేట జిల్లా:విద్యార్థులు ఇష్టపడి పట్టుదలతో కృషి చేసినట్లయితే విజయం సాధించవచ్చని విజిలెన్స్ డి.ఎస్.

 Perseverance Can Lead To Success-TeluguStop.com

పి అమరగాని కృష్ణయ్య పేర్కొన్నారు.శనివారం కోదాడ పట్టణంలో స్థానిక త్రివేణి డిగ్రీ కళాశాల నందు జరిగిన పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనేక పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నందువల్ల విద్యార్థులు,నిరుద్యోగులు పోటీ పరీక్షలకు గాను అమరగాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల పుస్తకాలను ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.అనేక రకాల పోటీ పరీక్షలకు ఉపకరించే ఈ పుస్తకాలు విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు.

పోటీ పరీక్షలకు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితేనే అనుకున్నది సాధించవచ్చని అన్నారు.ప్రభుత్వ ఉద్యోగాలు రానంత మాత్రాన విద్యార్థులు నిరాశ చెందకుండా విజయం సాధించేంతవరకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వాగ్దేవి విద్యా సంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి,త్రివేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాస్,రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ ప్రిన్సిపాల్ ఆర్.రామకృష్ణ,వాగ్దేవి డే స్కాలర్ ప్రిన్సిపాల్ మండవ మధు,శివశంకర్, కాశయ్య,అశోక్,తాటికొండ శ్రీనివాస్,పసుపులేటి వెంకన్న,నాగిరెడ్డి,లక్ష్మయ్య,బి.రామకృష్ణారెడ్డి, పొనుగోటి సైదులు,సాజిద్,ఇజ్రాయిల్,నవాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.తదనంతరం కళాశాల యాజమాన్యం డిఎస్పి కృష్ణని పుస్తకాల బహుకరణ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube