ప్రైవేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలి:డివైఎఫ్ఐ

సూర్యాపేట జిల్లా:ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడిని అరికట్టాలని డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు మీసాల వీరబాబు అన్నారు.శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ)సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ హాస్పటల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను పీల్చిపిప్పి చేస్తున్నాయని,వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేక పోవడమే దీనికి కారణమని అన్నారు.అధిక ఫీజులు వసూలు చేసే హాస్పటల్స్ పై అధికారులు తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.2011 మెడికల్ ఎస్టాబ్లేషన్ చట్టం ప్రకారం ప్రైవేట్ హాస్పటల్ యజమాన్యం నిబంధనలు పాటించకుండా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నరని,ఆస్పత్రికి వచ్చే రోగులనుంచి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నారని,కొన్ని ప్రైవేట్ హాస్పటల్స్ కనీస ఫీజు వివరాలు డిస్ ప్లే చెయ్యడం లేదన్నారు.ప్రైవేట్ హాస్పటల్స్ ఓపి ఫీజు,ల్యాబ్ ఫీజుల రూపంలో, మెడిసిన్ షాప్ ద్వారా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రైవేట్ హాస్పిటల్లో అర్హతలేని నర్సులు,ల్యాబ్ టెక్నీషియన్ పెట్టుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

 Exploitation Of Private Hospital Fees Should Be Curbed: Dyfi-TeluguStop.com

ప్రైవేట్ హాస్పిటల్స్ పై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గొబ్బి అబ్రహం,పట్టణ అధ్యక్షుడు ఇందిరాల నరేష్,పట్టణ కమిటి సభ్యులు వడ్లనపు పవన్, ఫాయాజ్,నరసింహచారి,సంతోష్,శేష్ కుమార్,పాలపాటి నరసింహారావు, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube