సూర్యాపేట జిల్లా: తమ ఆర్థిక రాజకీయ స్వలాభాల కోసమే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని టీజేఎస్ చైర్మన్ కోదండరాం అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ జనసమితి 3వ, ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా తన సొంత ఎజెండా అమలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ పదాన్ని వదిలి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మరచి బీఆర్ఎస్ తో దేశ రాజకీయాలలోకి వెళ్లడం సరికాదన్నారు.దేశంలోనే అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని,
అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం,రైతుకు రుణమాఫీ లేక అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే రైతు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు.
పోడు రైతులకు పట్టాలు లేవని, విద్య,వైద్యం ఉచితంగా అందట్లేదని,తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం ఒక టీజేఎస్ తోనే సాధ్యమని,తెలంగాణ పరిరక్షణకు ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తుందన్నారు.తెలంగాణ శక్తులు,ఉద్యమకారులు ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని పిలుపునచ్చారు.
ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని,తెలంగాణ జన సమితి అస్తిత్వాన్ని కాపాడుకుంటామని పేర్కొన్నారు.