ఎస్సారెస్పీ నీళ్ల కోసం కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఆత్మకూర్ (ఎస్), పెన్ పహాడ్,చివ్వేంల మండలాలకు చెందిన అన్నదాతలు ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీళ్ళు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పురుగులమందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు.వాటిని గమనించిన పోలీసులు రైతులను అడ్డుకున్నారు.

 Agitation Of Farmers In Front Of Collectorate For Ssaresp Water , Ssaresp Water,-TeluguStop.com

అనంతరం రైతులు మాట్లడుతూ ఎస్సారెస్పీ పరిధిలోని 69,70,71 డీబీఎం కాల్వల్లో సామర్ధ్యానికి సరిపడా నీళ్ళు రాకపోవడంతో చివరి ఆయకట్టుకు నీళ్ళు అందక పంటలు ఎండిపోతున్నాయని, వేలల్లో పెట్టుబడి పెట్టామని,నీళ్ళు అందకపోతే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పంటలు కాపాడుకోవాలంటే మరో 15 రోజులు పాటు నీళ్ళు అందించాలని కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube