సూర్యపేట జిల్లా:తెలంగాణా విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు ఋణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.గురువారం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కి తుగ్గట్టుగా సరఫరాకి అన్ని ఏర్పాట్లు చేసామని, 17000mw పైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్రలు చేస్తుందని,తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణాను ప్రోత్సహించాల్సిన కేంద్రం వివక్ష చూపెడుతున్నదని మండిపడ్డారు.నిరంతరంగా ప్రజలకు విద్యుత్ అందిస్తున్న తెలంగాణా విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం మోకాలడ్డుతుందని ఆరోపించారు.
రాష్ట్రానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్,రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సంస్థల రుణాలను రాకుండా కేంద్రం కుట్రలు చేసిందన్నారు.తెలంగాణపై కేంద్ర కక్షపూరిత వైఖరిని ఖండిస్తున్నామని,కేసీఆర్ వెంట నడుస్తున్న తెలంగాణా రైతుల ఉసురు తీసే కుట్రలు చేస్తున్నది ధ్వజమెత్తారు.
రావాల్సిన నిధులపై చట్టప్రకారం పోరాటం చేస్తామని,విద్యుత్ అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇతర సంస్థలు తెలంగాణాకు విద్యుత్ అమ్మొద్దని కేంద్రం బెదిరిస్తుందన్నారు.విద్యుత్ సరఫరాని అడ్డుకుంటూ తెలంగాణా అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయడని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదేనని, బొగ్గు దిగుమతుల ధరలు,పెట్రో,డీజిల్ చార్జీలు పెరగడంతో పాటు,కేంద్రం అడ్డగోలుగా పన్నులు విధించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని తెలిపారు.బీజేపీ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి ప్రజల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.