సూర్యాపేట జిల్లా:మేళ్లచెరువు గ్రామపంచాయితీ పరిధిలోని మైహోం సిమెంట్ పరిశ్రమ నూతన ప్లాంట్ (యూనిట్-IV) నిర్మాణ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తును మేళ్లచెర్వు గ్రామ పంచాయతీ పాలకవర్గం,అధికారులు తిరస్కరించారు.నిర్మాణ పనులు నిలిపివేయాలని పంచాయితీ రాజ్ శాఖ అధికారులు జారీ చేసిన నోటీసు మైహోమ్ సిమెంట్ యాజమాన్యం స్వీకరించక పోవడంతో మంగళవారం పనులు నిలిపివేయాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసు పంపారు.1.75 ఎంటీపీఏ క్లింకర్ & సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1000 కోట్ల వ్యయంతో మై హోమ్ సిమెంట్స్ ఇండస్ట్రీస్ సంస్థ నిర్మిస్తున్న నూతన ప్లాంట్ (యూనిట్-4) పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.మైహోమ్స్ నూతన ప్లాంట్ అక్రమ నిర్మాణాలపై ఇటీవల కేసులు నమోదు చేయాలని హుజూర్ నగర్ కోర్ట్ ఆదేశాలతో కేసులు నమోదు చేశారు.1068,1069,1072 సర్వే నెంబర్లు గల భూమికి పర్యావరణ అనుమతులు పొంది,876,1057,877,878,879,880,881, 882,883,884,885,1060,1068,1069,1070,1071,1072 వివాదాస్పద సర్వే నెంబర్లలో గల భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టిందని అభియోగంతో మైహోమ్ భాగోతం వెలుగులోకి వచ్చింది.దీనితో పర్యావరణ క్లియరెన్స్,టీఎస్ ఐపాస్,డిటిసిపి, రెవిన్యూ శాఖల క్లియరెన్స్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ అనుమతులు నిరాకరించింది.
ఇప్పటికే 30% ప్లాంట్ నిర్మాణ పనులు,అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తి కావడంతో నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామపంచాయతీ అధికారులు నోటీసు పంపారు.