సూర్యాపేట జిల్లా:ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి సిపిఆర్( CPR ) పై అవగాహన అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు.జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద గురువారం స్థానిక వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్టీసీ కండక్టర్లు,డ్రైవర్లు, సిబ్బందికి సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ సిపిఆర్ పై గురించి తెలిస్తే జీవితంలో లక్ష మందిలో ఒకరినైనా కాపాడవచ్చని,ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ప్రస్తుతం విధి నిర్వహణలో పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులలో హృదయానికి రక్తప్రసరణ లేకపోవడం వలన ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు.
వెన్నెల ఆసుపత్రి( Vennela Hospital ) జనరల్,ఛాతి వైద్య నిపుణులు నరేష్ మామిడి మాట్లాడుతూ ముందుగా హృదయ సంబంధమైన సమస్య వచ్చినప్పుడు ముందుగా 108 కి కాల్ చేసి ఆ వ్యక్తికి నిమిషానికి 100 సార్లు సిపిఆర్ చేయాలని నుదుటి భాగాన్ని చేత్తో పట్టుకొని 30 సార్లు నోట్లో ఊదడం ద్వారా ఆక్సిజన్ అందించవచ్ఛని దాంతో కొన్ని నిమిషాల పాటు ఆ వ్యక్తిని కాపాడవచ్చని చెప్పారు.ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి పని ఒత్తిడి ఎక్కువైందని నెగటివ్ దృక్పదాన్ని వీడి పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతో ఒత్తిడిని జయించవచ్చని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో హడావుడిగా భోజనం చేసేటప్పుడు గొంతులో ముద్ద ఇరుక్కోవటం గాని,ఇతర పదార్థాలు ఇరుక్కోవడంతో వ్యక్తి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని,అలాంటి సందర్భంలో ఉదర భాగంలో ప్రెస్ చేయడం ద్వారా ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడొచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ డి.సురేందర్,వెన్నెల ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ బయ్యా దయాకర్ యాదవ్,ఆస్పత్రి సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.