ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి::కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

ఎన్నికల వ్యయ వివరాలను పకడ్బందిగా నమోదు చేయాలి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి ప్రతి రాజకీయ పార్టీ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి ఒక వ్యయాన్ని నమోదు చేయాలి ఎన్నికల వ్యయ వివరాలు నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లఘనలపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఎన్నికల వ్యయ వివరాల నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లఘనల పై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ (ఏ.

 Collector And District Election Officer Anurag Jayanthi Should Conduct Election-TeluguStop.com

ఈ.ఓ)లతో సమీక్షించారు.కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలక బృందాలు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం మనమంతా భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని, మనం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, మన పారదర్శకత ప్రతి అంశంలో స్పష్టంగా కనిపించాలని , ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు.

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘనలను, నగదు,మద్యం పంపిణిను గుర్తించడం, రిపోర్ట్ చేయడం ఆధారాలు సేకరించడం, రికార్డు చేయడం చాలా కీలకమని, సి-విజల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.విధుల్లో భాగంగా ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వలెన్స్ బృందాలు నగదు ,ఇతర ఆభరణాలు సీజ్ చేసీనప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకోవాలని, ఏ మాత్రం నిర్లక్షం ప్రదర్శించ వద్దని సూచించారు ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టడమే మన లక్ష్యమని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని అన్నారు.

నగదు సీజ్ చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, నగదు సీజ్ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలని అన్నారు.వీడియో సర్వేలెన్సు బృందాలు ,వీడియో వ్యూయింగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు ఎన్నికల నేపథ్యంలో జరిగే ప్రతి రాజకీయ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వినియోగించిన వాహనాలు, కుర్చీలు, స్టేజి, సౌండ్ ఏర్పాట్లు , భోజనం తదితర ప్రతి అంశాన్ని పరిశీలించి వివరాలు నమోదు, రికార్డ్ చేయాలని అన్నారు.

అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా జాగ్రత్తలు వహించాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేములవాడ రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తరువాత రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు.ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం, వాటిని పరిశీలించడం, ఖర్చు పై నివేదిక తయారు చేసే విధానం పై పి.పి.టి.ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ మహేందర్ రెడ్డి , అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube