పెరుగు నల్లని మచ్చలను తొలగిస్తుందని మీకు తెలుసా?

How To Use Curd For Skin Care

పెరుగు అనేది దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మరియు బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

 How To Use Curd For Skin Care-TeluguStop.com

వీటి గురించి తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ట్యాన్, నల్లని మచ్చలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

అంతేకాకుండా పెరుగు బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.ఇప్పుడు పెరుగుతో ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

ఒక స్పూన్ పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖం,మెడ మీద పట్టించి అరగంట అయ్యాక సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు ఒక నెల పాటు చేస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతం అవుతుంది.

ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడిని తీసుకుని పెరుగుకలిపి మెత్తని పేస్టుగా చేయాలి.దీనిని ముఖానికి, మెడకు బాగా పట్టించి అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయండి.

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు తొలగిపోతాయి.
ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగుకు రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలపండి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిముషాలు మర్దన చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటె ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.

ఒక చిన్న అరటి పండు ముక్కను తీసుకుని గుజ్జుగా చేయండి.దీనికి ఒక స్పూన్పెరుగును వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఉంచండి.ఆ తరువాత నీటితో కడిగేయండి.

ఈ ప్యాక్ ముఖం మీద ట్యాన్ ని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube