జాతీయ గ్రామీణ అవార్డులను మిస్ కావొద్దు:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాకు అత్యధికంగా అవార్డులు వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు“జాతీయ గ్రామీణ అవార్డుల” విధివిధానాలపై 29 శాఖల జిల్లా,మండల స్థాయి అధికారులకు అవార్డుల విధివిధానాలు మరియు గ్రామ స్థాయిలో సమాచార సేకరణపై నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయితీలు,మండలాలు,జిల్లాలను వాటి పరిధిలో ఉన్న మౌలిక వసతులు,ప్రజల జీవన ప్రమాణాలు, పచ్చదనం పరిశుభ్రత,ప్రజారోగ్యం,సామాజిక భద్రత, భరోసా,పేదరిక నిర్మూలనలో గ్రామస్థితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొంటారని పేర్కొన్నారు.9 కేటగిరీలలో అవార్డులను 20 లక్షల నుండి 5 కోట్ల భారీ నజరానాలతో ప్రకటించడం జరుగుతుందని,ఆ అవార్డులను మన జిల్లాలో ఎక్కువ మొత్తంలో పొందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.అధికారులు నిర్దేశించిన నమూనాలో కావాల్సిన సమాచారాన్ని పొందుపరచి సకాలములో జిల్లాలో సమర్పించవలసిందిగా కోరారు.1.పేదరిక నిర్మూలన మరియు మెరుగైన జీవనవిధానం గల గ్రామపంచాయితీ.2.ఆరోగ్య గ్రామపంచాయితీ.3.పిల్లలకు స్నేహ పూర్వక గ్రామ పంచాయితీ.4.సమృద్ది జలసిరుల గ్రామ పంచాయితీ.5.స్వచ్చ మరియు హరిత గ్రామ పంచాయితీ.6.మౌలిక వాసతుల్లో స్వయం సమృద్ది గ్రామ పంచాయితీ.7.సామాజిక భద్రతలో మేటి గ్రామ పంచాయితీ.8.గుడ్ గవర్నెన్స్ (పాలనలో పారదర్శక గ్రామ పంచాయితీ).9.మహిళా స్నేహశీలి గ్రామ పంచాయితీ.

 Don't Miss The National Rural Awards: Collector-TeluguStop.com

పైన పేర్కొన్న తొమ్మిది కేటగిరీల్లో గ్రామ పంచాయితీ పరిధిలో ఒక్కో కేటగిరీలో మొదటి స్థానమునకు 50 లక్షలు,రెండవ స్టానమునకు 30 లక్షలు,మూడవ స్థానమునకు 20 లక్షలు ఉంటాయన్నారు.తొమ్మిది కేటగిరీలు కలిపి మొత్తంగా ఉత్తమ గ్రామపంచాయితీలకి మొదటి స్థానమునకు 150 లక్షలు,రెండవ స్టానమునకు 125 లక్షలు,మూడవ స్థానమునకు 100 లక్షలు ఉంటాయని తెలిపారు.

అలాగే జిల్లా స్థాయిలో మొదటి స్థానమునకు 5 కోట్లు,రెండవ స్టానమునకు 3 కోట్లు,మూడవ స్థానమునకు 2 కోట్లుగా ఇవ్వబడునన్నారు.జిల్లాలో పై తొమ్మిది కేటగిరీల్లో అత్యంత ప్రగతి ఉన్నందున ఎట్టిపరిస్థితిలో అవకాశం ఉండి కూడా అవార్డు మిస్ అవ్వకుండా ప్రతీ అంశమును సేకరించి గ్రామ నివేదికలో పొందు పరచాలని సూచించారు.

అనంతరం సీఈఓ డీఆర్డీవో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమములో సీఈఓ సురేష్, డీఆర్డీవో పిడీ సుందరి కిరణ్ కుమార్,డిపివో యాదయ్య,డిఎం అండ్ హెచ్ఓ డా.కోటాచాలం,జిల్లా సంక్షేమ శాఖ అధికారి,జిల్లా అధికారులు పంచాయితీ రాజ్,వైద్య,ఇంజనీరింగ్ ఇతర శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube