ఏపీ హైకోర్టులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది.వైద్య చికిత్సల నిమిత్తం అమెరికా వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో ముందస్తు బెయిల్ షరతులను సడలించాలన్న అభ్యర్థనపై స్పందించిన హైకోర్టు షరతులను సడిలిస్తున్నట్లు తెలిపింది.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీమంత్రి నారాయణపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండటంతో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.అయితే, ఈ బెయిల్ కు షరతులను జోడించి జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలని మరోసారి దాఖలైన పిటిషన్ ను కోర్టు బుధవారం విచారించింది.
పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం.ముందస్తు బెయిల్ షరతులను సడలించింది.
వైద్య చికిత్సల నిమిత్తం నారాయణకు మూడు నెలల సమయాన్ని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.








