కేసీఆర్ కు మా కుటుంబాలంతా రుణపడి ఉంటాయి

సూర్యాపేట జిల్లా:గత 20 ఏండ్లుగా చీకట్లో మగ్గుతున్న తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన స్థిరీకరణ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ మా కుటుంబాల్లో వెలుగులు నింపారని సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,డిపిఎం రత్తయ్య,సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మిట్టగడుపుల కరుణాకర్ లు హర్షం వ్యక్తం చేశారు.4200ల మంది సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన స్థిరీకరణ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్,రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా శ్రమిస్తున్న తమకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచడం ఆనందంగా ఉందన్నారు.మా శ్రమను గుర్తించి వేతన స్థిరీకరణ చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్,మంత్రులు జీజేఆర్,కెటిఆర్,ఎర్రబెల్లి దయాకర్రావులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయన్నారు.

 All Our Families Are Indebted To Kcr-TeluguStop.com

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన స్ఫూర్తి మహిళా సంక్షేమానికి మరింత కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వలిశెట్టి మల్లేశ్, నాయకులు అజయ్ నాయక్,డీపీఎం గోవింద్, ఏపిఎం పొలిశెట్టి నర్సయ్యగౌడ్,వెంకన్న,జిల్లా సీసీల యూనియన్ అధ్యక్షుడు చంద్రు,చెన్నయ్య, నిఖిలేశ్వరి,రాజూభాయ్,శోభా,మేరీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube