సూర్యాపేట జిల్లా:సమాజంలో ఎవరి కుటుంబం వారు చూసుకోవడమే గగనంగా ఉన్న తరుణంలో చిన్న పాటి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కులువు చేస్తూమానవత్వంతో వచ్చే జీతంలో సగం పేద విద్యార్థుల( Poor students ) చదువులకు ఖర్చు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాలవెల్లి రమేష ఔదార్యం అందరికీ ఆదర్శప్రాయం.శుక్రవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 50 మంది వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తల్లిదండ్రులు లేని అనాథాశ్రమ పాఠశాల పిల్లలకు ఒక్కొక్క విద్యార్థికి పుస్తకాలు,నోట్ బుక్స్,పెన్నులు,బ్యాగులు, షూస్,ఫ్యాడ్స్ తదితర సామాగ్రిని ఒక్కో విద్యార్థికి 2000 రూపాయల వరకూ మొత్తం లక్ష రూపాయల పుస్తక సామాగ్రిని అందజేశారు.
పాలవెల్లి రమేష్ 2008 సంవత్సరం నుంచి ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూనే తన సొంత డబ్బుతో పేదవారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు.అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేసి తన మానవతా దృక్పధాన్ని చాటారు.
నేటి యువతరం రమేష్( Ramesh ) సేవా గుణాన్ని ఆదర్శంగా తీసుకొనిజీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అనంతరం రమేష్ మాట్లాడుతూ నాకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషదాయకమని,ప్రతి పేదవారికి మానవతా దృక్పథంతో మనకు తోచినంత ఎంతో కొంత సహాయం చేయాలని విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు.
అంతేకాదు ఇప్పటివరకు 40 సార్లు బ్లడ్ డొనేషన్ చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ జహంగీర్( SI Jahangir ),కానిస్టేబుల్ శ్రీకాంత్, హోంగార్డ్ హరీఫ్, నాగరాజు,మదనాచారి తదితరులు పాల్గొన్నారు.