సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణానికి చెందిన పొన్నం మౌనిక (25) వివాహిత కనిపించడం లేదంటూ ఆమె భర్త పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.శుక్రవారం సాయంత్రం గడ్డిపల్లి గ్రామంలోని తన తల్లిగారింటికి వెళ్ళివస్తానని భర్తతో చెప్పి,చిన్న కుమార్తెను తీసుకొని ఇంటి నుండి బయలుదేరిన మౌనిక గడ్డిపల్లి వెళ్లకుండా ఏటో తప్పిపోయినదని భర్త పొన్నం సతీష్ చెబుతున్నారు.
భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.