నేరేడుచర్లలో వర్షానికి కూలిన ఇల్లు,తక్షణ సహాయం అందించిన అధికారులు

గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు( Heavy Rains ) నేరేడుచర్ల పట్టణంలో( Nereducharla )ని శివాజీ నగర్ కాలనీకి చెందిన ఇంజమూరి వెంకటయ్యకు చెందిన ఇల్లు బుధవారం రాత్రి కూలిపోయింది.దీనితోఆ నిరుపేద కుటుంబం నిరాశ్రయులయ్యారు.గురువారం విషయం తెలుసుకున్న స్థానిక తహసిల్దార్ సరిత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ జయబాబు కూలిన ఇళ్లును పరిశీలించి,తక్షణ సహాయం కింద రూ.5 వేలు ఆర్థికంగా సహాయం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు తగ్గేంతవరకు బాధితుడిని సురక్షత ప్రాంతమైన ప్రభుత్వ పరిధిలో ఉన్న టౌన్ హాల్ లో ఉండాలని సూచించారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే సహాయం ఉంటే తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు.

 House Collapsed Due To Heavy Rains In Nereducharla, Nereducharla,heavy Rains ,te-TeluguStop.com

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలని,శిథిలావస్థలోని ఇళ్లలో ఉండకూడదని చెప్పారు.ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ కౌన్సిలర్ రణపంగ నాగయ్య, మున్సిపల్ సిబ్బంది,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube