మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైతే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష:ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలో రోడ్డు ప్రమాదాలు వాహనదారుల,ప్రజల అజాగ్రత్త వల్లనే ఎక్కువగా నమోదవుతున్నాయని, వాహనదారులు,ప్రజలు ముందస్తు జాగ్రత్తలు మరియు రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ( Rahul Hegde )బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రమాదాలకు గల కారణాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి లోపాలను సవరిస్తున్నామని,జిల్లాలో అన్ని రహదారులపై 2023 జనవరి నుండి ఇప్పటి వరకు 687 రోడ్డు ప్రమాదాలు సంభవించాయని, ఇందులో 302 మంది మృత్యువాత పడగా 646 మంది క్షతగాత్రులయ్యారని,ఈ గణాంకాలు కలవర పెడుతున్నాయని,ప్రజలు, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండి రహదారి భద్రత( Road safety ) నియమ నిబంధనలు పాటించాలని,ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చన్నారు.

 If You Cause A Road Accident While Under The Influence Of Alcohol, The Maximum J-TeluguStop.com

పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని కోరారు.రోడ్డు ప్రమదాలకు కారణమైన వారికి జైలు శిక్షలు పడుతున్నాయని,మద్యం మత్తులోవాహనాలునడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారకులైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడతాయనిచెప్పారు.

సూర్యాపేట రూరల్,పట్టణ పరిధిలో జరిగిన తీవ్రమైన రోడ్డు ప్రమాదాలలో నిందితులకు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు.ఎక్కువగా మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం,అజాగ్రత్త వల్లనే రోడ్డు ప్రమాదాలు ( Road accidents )జరుగుతున్నాయని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలను నివారించడం ప్రతిఒక్కరి బాధ్యతని,సామర్ధ్యానికి మించి రవాణా చేయడం, మద్యం తాగి వాహనం నడపడం నేరమని సూచించారు.

రోడ్డు భద్రతా నియమాలు,పోలీసు సూచనలు పాటించాలన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.

హెల్మెట్,సీటు బెల్ట్ విధిగా ధరించాలి.అధికవేగంతో వాహనం నడపవద్దు.

వాహన సామర్ధ్యానికి మించి రవాణా చేయవద్దు.రాంగ్ పార్కింగ్,రాంగ్ రూట్ ప్రయాణం చేయవద్దు.

ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసింగ్ చేయవద్దు.గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించవద్దు.

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయవద్దు.

రైతులు రోడ్లపై ధాన్యం పోయవద్దు.ట్రాక్టర్ దమ్ము చక్రాలతో రోడ్లపైకి రావొద్దు.

పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు.నిద్రమత్తులో డ్రైవింగ్ చేయవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube