సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలో గతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న స్థలం ఇప్పుడు పూర్తిగా నిరుపయోగంగా ఉందని సామాజిక కార్యకర్త బెల్లంకొండ శేఖర్ అన్నారు.ఎంతో కాలం నుండి 90 దశకం వరకు నేరేడుచర్ల ప్రభుత్వ ఆసుపత్రి,ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ ఆవరణలో భాగంగా ఉండేది.
ఆసుపత్రి పూర్తిగా శిధిలమై ప్రస్తుతం ఖాళీ స్థలంగా మారి ఉన్నత పాఠశాల స్థలంలో కలిసిపోయిందన్నారు.ప్రస్తుతం ఆ స్థలం పాఠశాలకు కూడా ఉపయోగంలో లేదని,ఆ స్థలంలో ఆరోగ్య ఉపకేంద్రం,గ్రంధాలాయం నిర్మిస్తే,ఎంతో మంది ప్రజలకు,యువకులకు, విద్యార్థులకు ఉపయోగపడుతుందని అన్నారు.
మున్సిపల్ అభివృద్ధి నిధుల నుండి కొంత నిధులు వీటికి కేటాయించి అభివృద్ధి చేయాలని,మున్సిపల్ పాలకవర్గానికి విన్నవించారు.