పిల్లలమర్రిలో కమనీయంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారి కళ్యాణం సోమవారం రాత్రి అత్యంత కమనీయంగా జరిగింది.మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలో భాగంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

 Sri Chennakeshava Swamy Kalyanam In Pillalamarri,sri Chennakeshava Swamy Kalyana-TeluguStop.com

స్వామి వారి కల్యాణానికి ముందుగా ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

మంగళవారం ఉదయం మహిళల కోలాటం,డీజే చప్పులతో గ్రామ పుర వీధుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.అనంతరం దేవాలయం దగ్గర అన్నదానం చేశారు.

కార్యక్రమంలో దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్‌ కుమార్‌,కొరివి సతీష్‌, సట్టు పుష్ప,బంగారి చిన్నమల్లయ్య,లొడంగి నాగరాజు,అర్చకులు వరదాచార్యులు, రఘువరన్ ఆచార్యులు, రాఘవాచార్యులు, రామానుజచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube