పిల్లలమర్రిలో కమనీయంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

పిల్లలమర్రిలో కమనీయంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారి కళ్యాణం సోమవారం రాత్రి అత్యంత కమనీయంగా జరిగింది.

పిల్లలమర్రిలో కమనీయంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలో భాగంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

పిల్లలమర్రిలో కమనీయంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

స్వామి వారి కల్యాణానికి ముందుగా ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

మంగళవారం ఉదయం మహిళల కోలాటం,డీజే చప్పులతో గ్రామ పుర వీధుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.

అనంతరం దేవాలయం దగ్గర అన్నదానం చేశారు.కార్యక్రమంలో దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్‌ కుమార్‌,కొరివి సతీష్‌, సట్టు పుష్ప,బంగారి చిన్నమల్లయ్య,లొడంగి నాగరాజు,అర్చకులు వరదాచార్యులు, రఘువరన్ ఆచార్యులు, రాఘవాచార్యులు, రామానుజచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

వామ్మో, ఈ పెళ్లికూతురు వేషం చూస్తే నవ్వాగదు.. హల్దీలోకి డైనోసార్‌లా ఎంట్రీ.. వీడియో వైరల్..

వామ్మో, ఈ పెళ్లికూతురు వేషం చూస్తే నవ్వాగదు.. హల్దీలోకి డైనోసార్‌లా ఎంట్రీ.. వీడియో వైరల్..