సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఉన్న జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హైవే ప్రమాదాలపై చేపట్టవలసిన విధివిధానాలపై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పి రాజేంద్రప్రసాద్, అదనపు ఎస్పి రితిరాజ్ లతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హైవే లపై గుర్తించిన 29 ప్రమాద ప్రాంతాలలో అన్ని ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ ద్వారా హైవేలపై ఏర్పాటు చేసే బోలర్ట్స్,స్పీడ్ గన్స్,రేడియం స్టీక్సర్స్,ఇతర పనులకు సంబందించిన ఖర్చులకు నిధులు చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పట్టణాల్లో మరికొన్ని సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి అనువైన చోట స్పీడ్ బ్రేకర్స్,లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో గల హైవేలపై పవర్ బ్లింకర్స్,సైన్ బోర్డ్స్ అలాగే గ్రామీణ అప్రోచ్ రోడ్లకు సీడ్స్ బ్రేకర్స్ నిర్దేశించిన సమయంలోపు అన్ని పనులు పూర్తి చేయాలని జాతీయ రహదారుల అధికారులకు సూచించారు.తరుచుగా జరుగుతున్న ప్రమాదాల నివారణకై సత్వరమే రంబుల్స్ స్టీప్స్,ముఖ్యంగా పిల్లలమర్రి నుండి ఈనాడు కార్యాలయం జంక్షన్ వరకు సర్వీస్ రోడ్డుతో పాటు కావలసిన సదుపాయాలు సంబందించిన ప్రతిపాదనలు ఆర్.ఓ జాతీయ రహదారుల కార్యాలయంకి పంపేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఎలాంటి అనుమతి లేకుండా అప్రోచ్ రోడ్లలో యూ టర్న్స్ ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని అలాగే 30 నుండి 10 మీటర్లు వ్యవధిలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని పిఆర్, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
హైవేలపై ఉన్న ప్రమాద ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలియచేస్తూ తదుపరి జిపిలు,మున్సిపాలిటీల ద్వారా కరెంటు బిల్లులను చెల్లిస్తామని అన్నారు.ముఖ్యoగా పోలీస్,ఎన్ హెచ్ సిబ్బంది నిరంతరం హైవేలపై పెట్రోలింగ్ చేపట్టాలని అన్నారు.
అన్ని బ్రిడ్జ్ వద్ద గల రేలింగ్ లకు స్టిక్కరింగ్ తప్పక ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఓ వెంకటరెడ్డి, డి.ఎస్.పి.మోహన్ కుమార్,రఘు,ప్రాంతీయ ఇంజనీర్ విజయ్ కుమార్,జీఎంఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్,మేనేజర్ రమేష్,సి.ఆర్.ఓ నాగకృష్ణ, పోలీస్,రవాణా అధికారులు తదితరులు పాల్గొన్నారు.