సూర్యాపేట జిల్లా:మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని,యువశక్తి దేశసంపద,దేశంకోసం శక్తి, సామర్థ్యాలు సద్వినియోగం చేయాలని, ఈవ్ టీజింగ్ అనేది విషసంస్కృతి,ఇది మనసుకు గాయం చేస్తుందని,భౌతిక గాయాలు కొద్ది రోజులకు మానిపోతాయి,మనసుకు తగిలె గాయం మానదని జిల్లా ఎస్పీ ఎస్.రాజేoద్రప్రసాద్ అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు మాదకద్రవ్యాల నివారణపై,ఈవ్ టీజింగ్ నిర్మూలన,షీ టీమ్ ప్రాముఖ్యత,డయల్ 100 ప్రాముఖ్యతపై సూర్యాపేట డిఎస్పీ అధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్.రాజేoద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరైనారు.ముందుగా విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు,ఆలోచనలు,లక్ష్యాలను తెలుసుకున్నారు.
ఈ సంద్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశానికి యువశక్తి ఎంతో అవసరం ఉన్నది,ప్రపంచ దేశాల్లోకెళ్ళ భారతదేశానికి ఉన్న యువశక్తి మరి ఎదేశానికి లేదని అన్నారు.క్రమశిక్షణ కలిగి మన శక్తి, సామర్ధ్యాలను సరైన పద్దతిలో సద్వినియోగం చేస్తే విజయం వరిస్తుందన్నారు.
చెడు అలవాట్లకు లోనై యువత శక్తిని కోల్పోవద్దని,యువశక్తి విచ్ఛిన్నం కావద్దని కోరారు.ప్రభుత్వం మంచి అవకాశాలు కల్పిస్తోంది,అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.డ్రగ్స్,గంజాయి,కొకైన్ లాంటి మాదకద్రవ్యాలు సమాజానికి పట్టిన క్యాన్సర్ లాంటివి,వీటికి అలవాటు పడితే జీవితం,బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు.సమాజంలో ఇవి ఏ మూలన ఉన్నా,ఏవిధంగా రవాణా అవుతున్నా వాటి మూలాలను పెకిలించి,వాటిని నివారించడం మన అందరి సామాజిక బాధ్యతని అన్నారు.
వినియోగదారులను నిందితులుగా కాకుండా బాధితులుగా భావించి,వారు ఇలాంటి అలవాటు నుండి బయటపడటానికి మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.సమాచారాన్ని పోలీసు వారికి అందించాలని విద్యార్థులకు తెలిపినారు.
విద్యాసంస్థల్లో మరో ప్రమాదకరమైన అంశం ఈవ్ టీజింగ్,ర్యాగింగ్ అని, ఈవ్ టీజింగ్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరం, నేరమని తెల్పినారు.ర్యాగింగ్ అరికట్టడం, మహిళలకు భద్రతగా షీ టీమ్స్ పని చేస్తున్నాయి అన్నారు.
ఏదైనా సమస్య వస్తే పోలీసును సంప్రదించాలని,షీ టీమ్స్ కు,డయల్ 100 కు సమాచారం ఇవ్వాలన్నారు.ఇతరులను,పెద్దలను, మహిళలను గౌరవించాలని,ఇబ్బందులకు గురి చేయవద్దని,చెడు ప్రవర్తనతో సమస్యలను తెచ్చుకోవద్దని చెప్పారు.
ర్యాగింగ్ అనేది విష సంస్కృతి,ఇది మనసుకు గాయం చేస్తుందని,భౌతిక గాయాలు కొద్ది రోజులకు మానిపోతాయని,మనసుకు తగిలె గాయం మానదని ఆవేదన వ్యక్తం చేసినారు.కేసుల్లో ఇరుకుంటే భవిష్యత్తులో ఉద్యోగం పొందే విషయంలో,విదేశాలకు వెళ్లే విషయంలో పోలీసు ఎంక్వైరీలో ఇబ్బందులు ఎదురై కళలను సాకారం చేసుకోరని అన్నారు.
తప్పులు చేస్తే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామని,మీరు చెడ్డ పనులు చేసి పోలీసు స్టేషన్ కు వస్టే తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారనేది అలోసించండి అన్నారు.బాగా చదువుకుని ప్రయోజకులై ఇతరులకు ఆదర్శంగా ఉండి విద్యాసంస్థలు,తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ మోహన్ కుమార్,పట్టణ సీఐ ఆంజనేయులు,కళాశాల డైరక్టర్ కిరణ్,ప్రిన్సిపాల్ రాజు,విద్యార్థులు పాల్గొన్నారు.