పర్యాటకులకు అహ్లాదాన్ని పంచవలసిన పార్కులు మందు బాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.పైలాన్ కాలనీలోని ఎస్బీఐ బ్యాంక్ పార్కు మందు బాబులకు అడ్డాగా మారడంతో నిత్యం బ్యాంక్ పని మీద వచ్చే ఖాతాదారులకు మందు సీసాలు,తిని పారేసిన విస్తరాకులు, గ్లాసులు దర్శనం ఇస్తున్నాయి.
ప్రధాన డ్యాం ప్రక్కనే ఉన్న పార్కులో ఇటువంటి అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నా ప్రధాన డ్యాం భద్రతా సిబ్బంది, డ్యాం నిర్వాహణ అధికారులు,పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
నందికొండలోని నెహ్రూ పార్కు,లాంచీస్టేషన్ పార్కులపై ఎన్నెస్సీ అధికారుల పర్యవేక్షణ లేకవడంతో పార్కులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర్యాటక ప్రాంతమైన నందికొండకు వచ్చే పర్యాటకులకు సేద తీర్చుకునేలా పార్కులను అభివృద్ధి పరిచి, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.మారుతున్న పార్కులు
.