సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావుపై ఈ నెల 24 న అవిశ్వాసానికి రంగం సిద్దం కావడంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి జారీ చేసిన విప్ చెల్లదని మూడోవ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీలో దాదాపు 1/3 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని,నల్గొండ మరికొన్ని చోట్ల ఇదే విధంగా పాలకవర్గం చైర్మన్లు వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెడితే విప్ లు జారీ చేశారని,అయినా ఆ విప్ లు పరిగణలోకి తీసుకోకుండానే అవిశ్వాసాలు పెట్టడం,నెగ్గడం కూడా జరిగిందని గుర్తు చేశారు.
కోర్టులకు పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులు వాటిని అంగీకరించలేదని,అవిశ్వాసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.