నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ రెండేళ్లుగా ఉత్సవ విగ్రహంలా మారిపోయింది.పనులు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా ప్రారంభం చేయడానికి ఆనాటి ప్రజా ప్రతినిధులకు గానీ, సంబంధిత అధికారులకు కానీ,తీరిక దొరకకపోవడం గమనార్హం.
ప్రజా ధనంతో ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించిన వాటర్ ట్యాంకును అందుబాటులోకి తేకుండా ఉండడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ ను తక్షణమే ప్రారంభం చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందేలా చూడాలని కోరుతున్నారు.







