వీధి కుక్కలతో ప్రజల్లో భయం భయం...!

సూర్యాపేట జిల్లా: జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల స్వైర విహారం అధికమైంది.జిల్లాలోని ప్రధాన పట్టణాలైన సూర్యాపేట కోదాడ,హుజూర్ నగర్, నేరేడుచర్ల,తిరుమలగిరి మున్సిపల్ కేంద్రాల్లో, మండల మరియు గ్రామాల్లో,ప్రధాన రహదారుల్లో పగలు రాత్రి తేడా లేకుండా సంచరిస్తూ వచ్చిపోయే వారిపైన దాడులు చేస్తున్నాయి.

 People Fearing Of Stray Dogs Attack Details, People , Stray Dogs Attack, Stray D-TeluguStop.com

వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.జిల్లా కేంద్రంలో 23 వ వార్డులో రాజీవ్ నగర్,బర్లపెంట బజార్ లో వీధి కుక్కల దాడులు అధికమయ్యాయి.

ఇంటి ముందున్న వారిపై కూడా దాడి చేస్తూ భయం పుట్టిస్తున్నాయి.శుక్రవారం జిల్లా కేంద్రంలో ఇద్దరు బాలురపై వీధి కుక్కల దాడిచేయగా తీవ్ర గాయాలయ్యాయి.వారిని చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.దీనితో రోడ్లపై వెళ్లాలంటే ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని భయంగా ఉందని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Latest, Sudheer, Suryapet, Telugudistricts-Suryapet

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోజుకు కనీసం 30 నుండి 40 కుక్కకాటు కేసులు వస్తున్నాయని డ్యూటీ డాక్టర్లు చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికైనా జిల్లా ఉన్నాతాధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల బెడద నుండి జిల్లా ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube