సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజవర్గంలోని పలు మండలాల్లోని వైన్స్ షాపుల్లో లైట్ బీర్ నిల్ కాగా బెల్ట్ షాపుల్లో మాత్రం ఫుల్ గా ఉన్నాయి.వైన్ షాపు దగ్గరికి వెళ్తే చాలు కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లేవన్న మాటే తరచూ వినిపిస్తుండడంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
చేసేదేమీలేక దొరికింది తాగేస్తున్నారు.వైన్స్ లో లభించని కింగ్ ఫిషర్ బీర్లు బెల్ట్ షాపుల్లో దర్శనమిస్తున్నాయి.
దీంతో మందుబాబులు బెల్ట్ షాప్ లో బార్లు తీరుతున్నారు.ఇదే అదునుగా బెల్ట్ షాప్ ల యజమానులు ఒక కింగ్ ఫిషర్ లైట్ బీర్ కి వైన్ షాప్ కంటే అదనంగా రూ.60 లకు విక్రయిస్తూ బెల్ట్ దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగిస్తూ మందు బాబుల జేబులకు చిల్లు పెడుతున్నారని మందుబాబులు వాపోతున్నారు.