ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నాక ఆ సంస్థ కొత్త బాస్ ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.ఎలోన్ అక్టోబర్ 27న ట్విట్టర్‌ని కొనుగోలు చేశాడు.
నవంబర్ 4న శుక్రవారం ట్విట్టర్‌లో మస్క్ భారీ తొలగింపు ప్రక్రియను ప్రారంభించాడు.ఈ సంఘటనను చాలా మంది ఉద్యోగులు అస్తవ్యస్తంగా అభివర్ణించారు.
ట్విట్టర్‌లోని మొత్తం 7,500 మంది వ్యక్తుల కంపెనీలో సగం మంది తొలగించబడ్డారు.ఐదుగురు మాజీ ట్విటర్ ఉద్యోగుల బృందం ట్విట్టర్‌కి వ్యతిరేకంగా క్లాస్-యాక్షన్ దావా వేసింది.
తొలగింపులు ఫెడరల్, కాలిఫోర్నియా స్టేట్ వార్న్ చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది.

కంపెనీ యాజమాన్యాన్ని చేతుల్లోకి తీసుకున్న కొద్ది రోజుల్లోనే సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో సహా ట్విట్టర్ నాయకత్వాన్ని మస్క్ తొలగించారు.దీంతో ప్రకటనదారులు త్వరగా ట్విట్టర్‌లో ప్రకటన వ్యయాన్ని స్తంభింపజేయడం ప్రారంభించారు.ట్విట్టర్‌లో ప్రకటనలు రాకపోవడంతో ఆ సంస్థకు ఆదాయం తగ్గిపోయింది.మరో వైపు ఆదాయం కోసం బ్లూ టిక్ ఉన్న యూజర్లకు నెలకు 7.99 యూఎస్ డాలర్ల సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను ఎలాన్ మస్క్ విధించాడు.దీంతో ఛార్జీలు చెల్లించిన వారు బ్లూటిక్ పొందారు.ప్రముఖులు, ప్రముఖ సంస్థల పేరుతో బ్లూ టిక్ పొంది మోసాలకు పాల్పడ్డారు.ఈ నిర్ణయం బెడిసికొట్టడంతో దానిని మస్క్ ఉపసంహరించుకున్నాడు.ఇలా వరుస దెబ్బ మీద దెబ్బలతో ట్విట్టర్ ఉద్యోగుల విషయంలో ఎలాన్ మస్క్ పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది.
తిరిగి కొందరు ఉద్యోగులను సంస్థలోకి తిరిగి రావాలని కోరినట్లు సమాచారం.అయితే చాలా మంది ట్విట్టర్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్ ప్రీమియం చార్జీలు వంటివి వివాదాస్పదంగా మారాయని పలువురు పేర్కొంటున్నారు.