టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా స్టైలిష్‌గా ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు రౌడీ.కాగా ఈ సినిమా పూర్తయ్యాక విజయ్ ఎవరితో సినిమా చేస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమా తరువాత విజయ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే దీనికి సంబంధించి పచ్చ జెండా కూడా ఊపేశాడట.
దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కథ విజయ్‌కు బాగా నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నాని హీరోగా టక్ జగదీష్ చిత్రం తెరకెక్కిస్తున్న శివ నిర్వాణ, ఆ తరువాత విజయ్ దేవరకొండతో సినిమాను ప్రారంభించనున్నాడు.
మొత్తానికి విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలను చాలా సెలెక్టివ్‌గా చేయడానికి రెడీ అవుతున్నాడు.అయితే సినిమాలు వరుసబెట్టి చేస్తున్నా, సక్సెస్ మాత్రం పడటం లేదు.
మరి విజయ్ దేవరకొండకు అదిరిపోయే సక్సెస్‌ను ఏ సినిమా అందిస్తుందో చూడాలి.