రాజధాని అమరావతికి సంబంధించిన పలు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.రాజధాని పిటిషన్లతో కలిసి రాష్ట్ర విభజన కేసులు ఓ లిస్ట్ అయ్యాయని తెలుస్తోంది.
రెండు అంశాలపై మొత్తం 35 పిటిషన్లు దాఖలైయ్యాయి.అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సర్కార్ పిటిషన్ లో కోరింది.ఈ పిటిషన్లు అన్నింటిపై నేడు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.







