ఎంత బరువు ఉన్నా సరే రాగులను ఇలా తీసుకుంటే నెల రోజుల్లో నాజూగ్గా మారతారు!

అధిక బరువుతో బాధపడుతున్నారా.? ఇరుగు పొరుగు వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్లు తీవ్రంగా మదన పెడుతున్నాయా.? అయితే డోంట్ వర్రీ.బరువు పెరగడానికి కారణాలు అనేకం.

 Taking Finger Millet Like This Will Help You Lose Weight Quickly! Finger Millet,-TeluguStop.com

అలాగే తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు వెయిట్ లాస్ కు ఎంతగానో సహాయపడతాయి.

అటువంటి వాటిలో రాగులు ఒకటి.ఎంత బరువు ఉన్నా సరే రాగులను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే నెల రోజుల్లో నాజూగ్గా మారతారు.

మరి లేటెందుకు రాగులను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండిని వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్, చిటికెడు పింక్ సాల్ట్ వేసుకోవాలి.

వాటర్ కాస్త బాయిల్ అవ్వగానే అందులో రాగి పిండి మిశ్రమాన్ని వేసి స్పూన్ తో తిప్పుకుంటూ ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ రాగి మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

Telugu Finger Millet, Tips, Latest, Ragibadam, Ragulu-Telugu Health

ఈ లోపు బ్లెండ‌ర్ లో ప‌ది నైట్ అంతా వాటర్ లో నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులను వేసుకోవాలి.అలాగే హాఫ్‌ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ బాదం జ్యూస్ లో తయారు చేసి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని వేసుకోవాలి.మ‌రియు రెండు టేబుల్ స్పూన్లు తేనెను వేసి బాగా మిక్స్ చేసి నేరుగా సేవించడమే.

Telugu Finger Millet, Tips, Latest, Ragibadam, Ragulu-Telugu Health

ఈ రాగి బాదం స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా బరువు తగ్గడానికి ఈ స్మూతీ ఉత్తమంగా సహాయపడుతుంది.రెగ్యులర్ డైట్ లో ఈ రాగి బాదం స్మూతీని చేర్చుకోవడం వల్ల క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.అతి ఆకలి దూరమవుతుంది.చిరు తిండ్లపై మనసు మళ్ల‌కుండా ఉంటుంది.ఫలితంగా సూప‌ర్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube